మొన్నే ఒక కొత్త తెలుగు సినిమా చూసాను!! చాలా
బాధ పడ్డాను. మన తెలుగు సినిమా ఎప్పుడు మారుతుందా అని మధన పడ్డాను. ఎప్పుడో ఆ రోజు వస్తుందని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను . ఈ
ఉపోద్ఘాతం పక్కనపెడితే నాకు నచ్చిన మరో
సినిమా గురుంచి మొదలుపెట్టడం బెటర్ అనుకుంటాను.
నాకు
నచ్చిన సినిమా ! "ది హెల్ప్".
ముందుగా
సినిమా క్రెడిట్స్.
Title :
The Help.
Year :
2011
Director
: Tate Taylor
Writers
: Screenplay : TateTaylor , Novel :
Kathryn Stockett
Music :
Thomas Newman
సినిమా
పేరు : ది హెల్ప్.
సంవత్సరం
: 2011
డైరెక్టర్
: టేట్ టేలర్ .
నవల
: కాతరిన్ స్టాకేట్ .
ముఖ్యమైన
పాత్రలు ధరించిన వారు :
ఎమ్మా
స్టోన్, వయోల డేవిస్, మరియు ఒక్టేవియా స్పెన్సర్.
Emma Stone
: Skeeter Phelan
Viola Davis : Aibileen Clark
Octavia
Spencer : Minny Jackson
ఈ
సినిమా అమెరికాలో 1960 సివిల్ రైట్స్ మూవ్మెంట్ జరుగుతున్న
సమయంలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. వర్గ పోరాటాలు అని పెద్ద పోరాటాలు చూపించకుండా, సునిశితంగా, ఆఫ్రో అమెరికన్ విభేదాలని ఒక
మెయిడ్ కళ్ళతో, మనసుతో చూడటానికి, చూపటానికి చేసిన
ప్రయత్నమే ఈ సినిమా.
క్లుప్తంగా
స్టొరీ :
స్కీటర్ (ఎమ్మా
స్టోన్) అప్పుడే ఉన్నత విద్య ముగించుకుని, తానో రచయిత్రి
కావాలని నిశ్చయించుకుని,
తన ఊరికి వస్తుంది.
అక్కడ
అమెరికన్స్ ఆఫ్రికన్స్ పట్ల చూపించే వివక్ష ఆమె మనసుని కదిలిస్తుంది. తను రాయబోయే పుస్తకానికి అదే ఇతివృత్తాన్ని ఎన్నుకుని, ఒక
అమెరికన్ ఇంట్లో పనిచేసే
ఆఫ్రికన్ మెయిడ్ ఐబిలీన్ (వయోల డేవిస్) సహాయాన్ని
అర్ధిస్తుంది. ఐబిలీన్ తన స్నేహితురాలు మిన్ని
(ఒక్టవియా స్పెన్సర్) తో కలిసి తెల్ల జాతీయుల ఇళ్ళల్లో మెయిడ్సగా (హెల్ప్ ) తాము
ఎదుర్కునే వివక్ష గురించి, సాధక బాధకాల గురించి
వివరించటం, ఏతావాత పుస్తకం ప్రచురింపబడటంతో కలిగే పరిణామాలతో సినిమా
ముగుస్తుంది.
ఇందులో ప్రముఖంగా 1960స్ లో ఉన్న
వాతావరణాన్ని(సెట్టింగ్స్, ఆక్టర్స్ డ్రెస్సింగ్
వగైరాలు) చాలా బాగా చూపించారని,
మిన్ని
పాత్రలో సహజంగా నటించిన ఒక్టవియా స్పెన్సర్ కి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ దక్కింది అని, ఐబిలీన్
పాత్రలో వయోల డేవిస్ జీవించింది అన్నవి ఒక ఎత్తు
ఐతే, జాతివివక్ష గురించిన ప్రస్తావన ఇంకో ఎత్తు. నవలని
అద్భుతంగా తెరకెక్కించారన్న ప్రశంసలని కూడా పొందింది ఈ సినిమా. ఎన్నో అవార్డ్స్ ,
మరెన్నో రివార్డ్స్
ని సొంతం చేసుకున్న సినిమా ఇది.
ఇందులో జాతివివక్షతను తొలిగించే
సూత్రాలేమి లేవు. కేవలం జాతి వివక్షతని లైట్
గా, అంటే పెరిఫెరల్ లెవెల్ లో డీల్ చేశారు. లోతుగా పరిశీలించి నివారించటం, లేక సూచనలు ఇవ్వటం మనకు కనబడదు. కాకపొతే
ఉన్న పరిస్థితుల్ని సున్నితంగా
మనముందుకు తెచ్చే ప్రయత్నంలో "టేట్ టేలర్" సఫలీకృతులు అయ్యారనే చెప్పాలి.
స్కీటర్
తో మాట్లాడటానికే ఐబిలీన్ భయపడటం, కనీసం తమ జీవితాల గురించి స్కీటర్ తో చర్చించటానికి
కూడా మెయిడ్స్అందరూ జంకటం, తాము పనిచేసే
ఇళ్లలోని శ్వేతజాతీయులకు ఇది తెలిస్తే, తమ
పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో
అన్న భయం వాళ్ళను వెంటాడటం, సమాజాన్ని వెక్కిరిస్తున్నట్టు ఉంటుంది.
వాళ్ళు ఆ ఇళ్ళల్లో పొద్దున్న నుంచి సాయంత్రం
దాకా అన్ని పనులు చేస్తారు. పసి పిల్లల ఆలనా పాలనా చూస్తారు,
వంటా
వార్పూ చేస్తారు, ఇంటికి కావాల్సిన సామాన్లు తెస్తారు, ఇంటి
పనులన్నీ చేస్తారు. వాళ్ళు పెంచిన
పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కంటే వాళ్ళని కుడా పెంచుతారు. వీళ్ళు ఆ ఇంట్లో మనుషులతో విడదీయలేని
బంధాన్ని ఏర్పరుచుకుంటారు (తమ
పిల్లల్ని కూడా అలా చూసుకోలేని పరిస్థితి). కొంతమంది యజమానులకి కూడా వీరి పట్ల అబిమానం ఉంటుంది. కానీ వీళ్ళు ఆ ఇంటిలో, ఆ మనుషులలో,
ఒకరు కారు. ఎన్ని ఏళ్ళు పనిచేసినా వీళ్ళు కేవలం పనివళ్ళూగానె ట్రీట్ చెయ్యబడతారు. నిజానికి స్కీటర్ మెయిడ్ కూడా ముసలితనంలో ఆ ఇంటి నుండి గెంటివేయబడుతుంది. దే కాన్ నెవెర్ బీ ఈక్వల్
...... దే ఆర్ ఆల్వేస్ లెస్సెర్
మొర్టల్స్.
అగ్ర జాతి ఆధిపత్యం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
అసలు స్కీటర్ వీళ్ళతో మాట్లాడటం తోటి తెల్ల స్నేహితులకి కుడా నచ్చదు. ఈక్వల్స్ అంటే
యజమానితో సమానం అనికాదు, ఒక వ్యక్తిగా,
ఒక
మనిషిగా పొందాల్సిన గౌరవ మర్యాదల గురుంచిన ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్ని
ఏళ్ళు పనిచేస్తున్నా కేవలం మెయిడ్స్ గా
మిగిలిపోవటం అన్నది వాళ్ళని బాధించే విషయం.
వాళ్ళు కిచెన్ లోనె తినాలి, తమ బాత్రూమ్స్
ఎట్టి పరిస్తితుల్లోను వాడకూడదు. ఐబిలీన్ తో
ఇంటర్వ్యూ కావాలని స్కీటర్ బస్సు స్టాండ్ లో కలిసి అడిగినప్పుడు ఐబిలీన్ ఎంత భయపడుతుందో ఆమె నటనలో అద్భుతంగా పలికిస్తుంది. తను
ఒక తెల్ల అమ్మాయితో మాట్లాడటం ఎవరైనా చూస్తారేమోనని
ఆమె భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది.
నీకు ఇందులో ఎంత సమస్య ఉందొ తెలీకపొవటం నన్ను భయపెడుతోంది .."జిమ్
క్రో " కంటే భయపెడుతోంది అని అంటుంది . ఇక్కడో విషయం చెప్పుకోవాలి. 1880
నుంచి
1960 వరకు అమెరికాలో ముఖ్యమైన స్టేట్స్ లో "జిమ్ క్రో"
లాస్ అమలులొ ఉండేవట. శ్వేత వర్గీయులు, ఇతరుల
మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవచ్చు , వాళ్ళ మధ్య
ఉండాల్సిన గీతలు ఏమిటి , ఆ గీతలు దాటితే ఉండే లీగల్ పనిష్మెంట్స్
ఏమిటి అన్న విషయాలను జిమ్ క్రో లాస్ నిర్వచించాయి. అందులో ఒక రూల్ ఏమిటంటే,
ఎవరైనా సమానత్వం
గురించి రాసినా, పబ్లిష్ చేసినా , మాట్లాడినా లేక అలాంటి
ప్రయత్నం
గానీ ఆర్గ్యుమెంట్ గానీ ప్రచారంలోకి తేవటానికి ప్రయత్నించినా వాళ్ళు ఒక లీగల్ అఫెన్స్ చేసినట్టుగా పరిగణింపబడతారు, వాళ్ళు
శిక్షార్హులు కూడా.
ఇలాంటి చట్టాలు శ్వేత వర్గీయులు కాని వాళ్ళ కోసం తయారు
చెయ్యబడ్డాయి. శ్వేత వర్గీయులు
కాని వాళ్ళు ఎలా నడుచుకోవాలో నిర్దీశించె ఈ చట్టాలకు ఐబిలీన్
లాంటి వాళ్ళు చాలా భయపడే వాళ్ళు . అదీ వాళ్ళ పరిస్థితి. అలాంటి సమయంలో స్కీటర్ కార్ ఎక్కడో ఆపుకుని,
కాబ్లో
కొంత దూరం వచ్చి, ఐబిలీన్ వాళ్ళ
ఇంటికి చాలా దూరంలో దిగి, అక్కడినించి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐబిలీన్ ఎంత భయపడుతోందో,
అంతే
ఇబ్బందికి భయానికీ శ్వేత జాతీయురాలు అయిన స్కీటర్
కూడా
గురి కావటం. ఇద్దరూ కలిసి మాట్లాడుకోటమే
తప్పు అయినప్పుడు, ఇద్దరూ ఐబిలీన్ ఇంట్లో కూర్చుని మట్లాడుకోవటం ఇంకా ఘోరమైన నేరం. ఈ
భయాన్ని స్కీటర్ కూడా బాగా ప్రదర్శించింది.
మిన్ని మాత్రం కొంత ప్రతిఘటించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. భయంకరమైన వర్షం వస్తున్నా ఇంట్లో టాయిలెట్ వాడటానికి ఒప్పుకోని
యజమానిని ధిక్కరించి సైలెంట్ గా వాళ్ళ
టాయిలెట్ వాడుకుంటుంది. ఆ విషయంగానే తన ఉద్యోగాన్ని
కోల్పోతుంది మిన్ని. మిన్ని కుడా ఐబిలీన్తో కలిసి స్కీటర్ తో తన మెయిడ్ జీవితం గురించి చెప్తుంది.
చివరికి స్కీటర్ తనని పెంచిన మెయిడ్ ఏ తప్పూ చెయ్యకుండానే
ఇంట్లోంచి తరిమి వేయబడింది
అని తెలుసుకుని బాధ పడుతుంది. కానీ సమాజానికి భయపడి ఆమెను
తరిమేసిన
స్కిటర్ తల్లి, పుస్తక ప్రచురణ జరిగాక, "ఒకోసారి ధైర్యం
ఒక జనరేషన్ దాటి వస్తుంది" అని
స్కీటర్ తను చెయ్యలేని పని చేసింది అని సంతోషిస్తుంది.
ఇందులో
స్కీటర్ మెయిడ్, ఐబిలీన్ పిల్లలను పెంచే విధానం
చాల బాగా ఉంటుంది. స్కీటర్ తనని ఎవ్వరు డాన్సు కి పిలవలేదని , తను అందంగా ఉండనని అగ్లిగా ఉంటానని అందరు అంటారని
అన్నప్పుడు ఆమె మెయిడ్ ఒకటే చెప్తుంది
: " I wish you'd quit feeling sorry for yourself, now that's
ugly." అగ్లీ అన్న భావన మనలోపల్నుంచి పుడుతుంది,
అది
మనల్ని చాలా హర్ట్ చేస్తుంది అవతలి వాళ్ళ కామెంట్స్ లాగా, నువ్వు ఆ అవతలి వాళ్ళలో ఒకదానివా? ప్రతిరోజూ నువ్వు చచ్చిపోకుండా, మరురోజు ఉదయం నిద్ర లేచినప్పుడు,
"ఇవాళ
ఎవరో నా గురించి అన్న నెగటివ్ మాటలను నేను నమ్మాలా? అని
నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో," అని
చెప్తుంది. అలాగే ఐబిలీన్ తను
చూసుకుంటున్న పసిపాపకు ' యు ఇస్ కైండ్ , యు
ఇస్ స్మార్ట్ , యు ఇస్ ఇంపార్టెంట్
" అని నేర్పించటం .... ఆ పిల్లలకి అంత ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఐబిలీన్ లాంటి వాళ్ళను చూసినప్పుడు,
ఒక తల్లి నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని వీళ్ళు పరాయి పిల్లల పట్ల, ఎంత బాధ్యత తోటి నిర్వర్తిస్తారో కదా
అనిపించక మానదు. అది కుడా తమ యజమానుల పిల్లల పట్ల, తమని తక్కువగా చూసే జాతి వివక్షని మరిచి పిల్లలను స్వచ్చంగా ప్రేమించటం ఎంత గొప్ప లక్షణం? జీవిత సత్యాలను, జీవించటానికి కావాల్సిన ధైర్యాన్ని తాము చూసుకుంటున్న పిల్లల్లో నింపటానికి వీరికి జాతి అడ్డం రాదు. ఈ మెయిడ్స్ అండ్ పిల్లల మధ్య అనుబంధం అందంగా ఉంటుంది. క్లైమాక్స్
సీన్ లో ఐబిలీన్ నటన పరమాద్భుతం. యజమాని పట్ల కోపం, అసహ్యం, పసిపాపను విడిచి వెళ్తున్న దుఃఖం, కేవలం స్కీటర్ పుస్తకంలొ తన అనుభవాల్ని చెప్పినందుకు యజమాని తనని పరోక్షంగా దెబ్బకొట్టడానికి దొంగగా చిత్రీకరించటానికి ప్రయత్నించటం వల్ల కలిగే నిర్వేదం, ఆగ్రహం కలగలిపిన ఆ సీన్ చూడాల్సిందే !!
నేను
ఇంతకు ముందే చెప్పినట్టు ఇందులో అసలు ఇష్యూని కేవలం స్పృశించి వదిలేశారు.
అద్భుతాల్ని, సొల్యూషన్స్ని అందించదు ఈ సినిమా. కానీ ఖచ్చితంగా మానవ అసమానతల గురించి, మనం
మనుషుల్ని ఎలా చూస్తాం, మనం మన కన్నా తక్కువ స్థితిలో ఉన్న
వాళ్ళని ఎలా చూస్తాం, ఎలా ట్రీట్ చేస్తాం
అన్న విషయం గురించి పునరాలోచించేలా చేస్తుంది ఈ సినిమా. ఇట్
స్కోర్స్ మార్క్స్ దేర్! ఇట్స్ ఎ గుడ్
ఫిలిం, అందులో డౌట్ లెదు.