Saturday, February 16, 2013

కవిత...

గుండెలో గువ్వలా ఒదిగి,
అనంత రాగాన్ని ఆలకించే,
భావనా విహంగమా!

ఏ భావోద్వేగపు  పిల్ల తెమ్మెర
పిలిచిందోయ్  నిన్ను?
గుండె చీల్చుకుని ఎగసి పోయావ్,
అనంతాకాశంలోకి-
కవితాగాన  లహరివై!
కవి గుండెన పూచిన,
రక్త సింధూర పుష్పమై !!