నాకు నచ్చిన సినిమా – “ద ఇమిటేషన్ గేమ్.”
Film : The Imitation Game. (2014-UK)
Director : Morten Tyldum.
Stars : Benedict Cumberbatch, Keira Knightley.
మోర్టెన్ టిల్డమ్ డైరెక్ట్ చేసీ, బెనెడిక్ట్ కంబర్బాచ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మనల్ని కదిలిస్తుంది
అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. నిజ జీవితానికి సంబంధించిన ఈ కధ ఆండ్రూ హాడ్జస్ రాసిన
”Alan Turing : The Enigma” అనే పుస్తకం ఆధారంగా
నిర్మితమైంది. (పుస్తకం తప్పకుండా చదవాలి అని అనుకున్నాను J )
రెండో ప్రపంచ యుద్ద సమయంలో అలన్ ట్యూరింగ్ తెలివితేటలను బ్రిటన్ ఎలా ఉపయోగించుకుంది, ఒక దేశం తీసుకునే నిర్ణయాల
వెనక - ఆ దేశ ప్రజలకు తెలియని, ప్రజల జీవితాలను, తలరాతలనూ మార్చే నిర్ణయాలు
ఎలా తీసుకుంటారు అన్నది మనకు సూచనప్రాయంగా
అవగతమౌతుంది. అలాగే ఒక భిన్నమైన
వ్యక్తిత్వం గురించి మనసుకు హత్తుకునేలా చెప్పటం జరిగింది. అలన్ ట్యూరింగ్ మేధస్సు
ఎంత పదునైనదో చెబుతూనే అతనిలోని బలహీనతలను, తద్వారా అతను జీవితంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణను చక్కగా చూపించారు. ఆ
పాత్రలో బెనెడిక్ట్ కంబర్బాచ్ నటన అద్భుతం!
ఎనిమిది అంశాలలో ఈ సినిమా ఆస్కార్ కి పోటీ పడుతోంది అంటే ఇంకా ఏం చెప్పాలి!
సినిమా చూసెయ్యండి మరి!!!