నాకు నచ్చిన కొటేషన్స్ ఇలా రాసుకుంటే బావుంటుంది అనిపించింది.
ఇది కూడా ఓ ప్రయోగమే? అని నవ్వకండి. నేను చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఎప్పుడు ఇలాంటివి చూసినా, ఆహా అనుకునేదాన్ని. నిన్నఇలాంటివి కొన్ని చదువుతూ, అసలు ఇవి ఎలా తయారు చేస్తారు? నేను కూడా నాకు నచ్చిన పద్ధతిలో, నాకు చాలా నచ్చిన కొటేషన్స్ దాచుకుంటే ఎలా వుంటుంది అనిపించింది. ఇదిగో, ఆ ఆలోచన ఫలితమే - ఇవాళ్టి ఈ ప్రయత్నం!!!