ఫెయిల్యూర్ ఆఫ్ కైండ్నెస్. అది చూపించవలసినచోట మనం చూపించలేకపోవడం.
జార్జ్ సాండర్స్ (George Saunders) అనే రచయిత సిరక్యూస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ సెరిమనీలో భాగంగా విద్యార్ధులని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వాడిన మాట అది.
"What I regret most in my life are failures of kindness.
Those moments when another human being was there, in front of me, suffering, and I responded . . . sensibly. Reservedly. Mildly." - George Saunders
ఆయన వాడిన 'Failure of kindness' అన్న మాట రెండు రోజుల్నుంచీ నన్ను వెంటాడుతూ ఉంది. ప్రతి క్షణం నన్ను నేను ప్రశ్నించుకునేలా, నన్ను నేను గమనించుకునేలా చేస్తూనే ఉంది. అది చాలనట్టు, ఆ ప్రసంగంలో ఆయన ఉదహరించిన ఓ చిన్న సంఘటనలోని పాత్రని మన జీవితంలో మనం ఎన్నిసార్లు - అనుకోకుండా అయినాసరే - పోషించివుంటామో అన్నది మరింత కలవరం కలగజేస్తుంది.
"బీ కైండ్" అన్న మాట కొత్తగా వింటున్నదీ కాదు, తెలుసుకున్నదీ కాదు. కానీ ఈ రచయిత మాటలు మనసుని సున్నితంగా తట్టి లేపినట్టూ, చెమరింప చేసినట్టూ అనిపించింది. మనం చేయడం మరిచిపోయిన పనిని మనకి సున్నితంగా గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది.
చాలా చిన్న ప్రసంగం ఇది. మీకూ నచ్చుతుంది!
https://6thfloor.blogs.nytimes.com/2013/07/31/george-saunderss-advice-to-graduates/?_r=0