Sunday, April 14, 2013

రాతలూ గీతలూ....

Writing something is not easy at all. Writing what I feel about a film or a book is all the more difficult. Writing something and saving it is one thing. Writing and then publishing it in my blog is another thing ... it 's a big thing for me. I check whatever I write a hundred and one times. I check for spelling mistakes, I check for grammatical mistakes, typos and all. I feel so very responsible about it. But all the same I end up publishing whatever I write with some mistakes. 

ఇంత కష్టపడే బదులు సినిమాలు చూసుకుంటేనూ, పుస్తకాలు చదువుకుంటేనూ సరిపోదా ? అనిపిస్తుంది. ఏదైనా ప్రయత్నిస్తేనేకదా వస్తుంది అనుకుని, బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ కలం, కాదు కాదు కీబోర్డ్ పిచ్చి ఎమిటీ అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ ఏదో ఒకనాటికి నా రాతలు బాగుపడతాయనిన్ని, భావ వ్యక్తీకరణ పదునెక్కుతుంది అనిన్నీ, నా ఆశ.

అసలు చదివిన పుస్తకం గురించి కానీ చూసిన సినిమా గురించి కానీ రాయాలంటే, వాటి గురించి చాలా ఆలోచించాలి. ఆ ప్రాసెస్ బావుంటుంది. ఆ ఆలోచనలను క్రమబద్దీకరించటం , ట్రిమ్ చేయటం బావుంటుంది. కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటాం, సబ్జెక్టు పరంగా కానీ, బ్లాగ్గింగ్ పరంగా కానీ. అన్నిటికంటే బావుండే మరో విషయం ఏమిటంటే డొక్కు టీవీ ప్రోగ్రాములు చూడటానికి, పనికిమాలిన కబుర్లు చెప్పుకోటానికి టైం ఉండదు., అండ్ యు అర్ నాట్ బోర్డ్ , అండ్ టైమ్ ప్రొడక్టివ్ గా యుటిలైజ్ చేసిన ఆనందం మనకు మిగులుతుంది. అసలు టైమ్ సరిపోదు.
మనసుకు ఎంత హాయిగా  ఉంటుందో ..... ఎంత సేపూ ఆఫిసూ, ఇల్లూ ఇంటి పనులేనా?  మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి.

పొద్దున్న లేచి జిమ్మింగ్,
తరవాత కుకింగ్!
ఆ తరవాత ఆఫీసుకి రన్నింగ్,
ఒకోసారి టైం దొరికినప్పుడు  రీడింగ్,
లేదా ఫిలిం వాచింగ్,
అప్పుడప్పుడు ఇలా బ్లాగ్గింగ్,
శ్రీవారితో మరియు పాపతో టాకింగ్,
నిరంతర చాటరింగ్ !!
వహ్వా ఏమి ఈ  రైమింగ్ ???


బాబోయ్  ఏమిటి ఇలా పదాలు దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయి ....


సో ఈ నేపధ్యంలో నేను ఇంకా ఈ రాతలూ గీతలూ కంటిన్యూ చేస్తాను. :((

2 comments:

  1. మీ బ్లాగ్ చూసానండి
    బావుంది
    నెమ్మదిగా చదివి కామెంట్స్ పెడతాను
    మీకు కుదిరితే ఈ లింక్ చూడండి
    www. brundavanam.org

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ!
      మీరిచ్చిన లింక్ చుసాను.. చాలా మంచి ఆలొచన. మానవ సంబంధాలు మెరుగు పడాలన్నా, జీవితంలో ఆనందంగా ఉందాలన్నా, వ్యక్తిత్వంలో పరిపుర్ణత చాలా అవసరం.
      విపులంగా మళ్ళీ చూస్తాను. నాలుగు మంచి మాటలు మాట్లాడుకోగలగటం, మంచి విషయాలు చదవగలగటం సంతోషకరమైన విషయం.


      Delete