Saturday, January 11, 2014

నాకు నచ్చిన పాట....





“జగ్ జీత్ సింగ్” పేరు వినని సంగీత ప్రియులు, ముఖ్యంగా గజల్ ప్రియులు ఉండరేమో? 


నాకు ఆయన పాటలు – గజల్స్ అంటే చాలా ఇష్టం. 



ఉర్దూ పెద్దగా రాక పోవటం వల్ల గజల్ లోని ప్రతీ పదం నాకు అర్ధం కాదు.

కాకపోతే, మొత్తం మీద ఇదీ సందర్భం, ఇదీ అర్ధం అని ఒక గజల్ ఫీల్ అర్ధం చేసుకుని వింటూ ఉంటాను. 

అందులో ఉండే మెలడీ, భావుకత, అందం ....మీరే విని చూడండి ఈ పాట.


http://www.youtube.com/watch?v=448K_sTZZ9Q



సాంగ్ : బాత్ నిక్ లేగి తో ఫిర్ దూర్ తలక్ జాయెగి.


పాడినవారు : జగ్ జీత్ సింగ్.


రాసిన వారు : కఫీల్ అజార్.




Baat Niklegi To Phir…Door Talak Jayegi

బాత్ నిక్ లేగి తో ఫిర్, దూర్ తలక్ జాయెగీ,

( విషయం, మాట (మన ప్రేమగురించిన) బయటకు వస్తే, చాలా దూరం వెళ్తుంది)



Log Bewajah, Udasi Ka Sabab Poochenge

లోగ్ బే వజహ  ఉదాసీ క సబబ్ పూఛెంగే

( జనాలు అకారణంగా (అవసరం లేకున్నా) నీ ఉదాసీనతను గురించి ప్రశ్నిస్తారు)




Yeh Bhi Poochenge, Ke Tum Itni Pareshan Kyun Ho

యెహ్ భీ పూఛేంగే, కె  తుమ్ ఇత్నీ పరేషా క్యూం హో.

(నువ్వు ఇంత వ్యాకులతతో ఎందుకు ఉన్నావని కూడా ప్రశ్నిస్తారు)




Ungliyan Uthengi, Sookhe Baalon Ki Taraf

ఉంగిలియా ఊఠేంగే సూఖే హుయి బాలోంకి తరఫ్,

(ఎండి పోయిన నీ జూట్టు కేసి వేలెత్తి చూపుతారు)




Ek Nazar Dekhenge, Guzreh Huye Saalon Ki Taraf

ఇక్ నజర్ దేఖెంగే, గుజ్ రే హుయే సాలోంకి తరఫ్,

(ఒక సారి నీ గతం వైపుకు వారి చూపు ప్రసరిస్తుంది)




Chudiyon Pe Bhi, Kayi Tanz Kiye Jayenge

చూడియోన్ పర్ భీ కయీ తంజ్ కియే జాయేంగే

(నీ చేతి గాజుల గురించి కూడా ఎగతాళి చేస్తారు)




Kaapten Haathon Pe Bhi, Fikre Kase Jayenge

కాంప్ తే హథోంపె భీ, ఫిక్రే కసే జాయేంగే 

(నీ వణుకుతున్న చేతుల గురించి కూడా ఊహా గానాలు చేస్తారు)



Log Zaalim Hai, Harek Baat Ka Taana Denge

లోగ్ జాలిమ్ హై, హర్ ఇక్ బాత్ క తానాదేంగే, 


(జనాలు చాలా క్రూరులు, నీ ప్రతి చర్యని గేలి చేస్తారు)




Baaton Baaton Mein, Mera Zikr Bhi Le Aayenge (2)

బాతోం బాతోం మె, మేరా జీక్ర్ భీ లే ఆయెంగే, 


(మాట మాటకీ నా ప్రస్తావన తీసుకొస్తారు)




Unki Baaton Ka Zara Sa Bhi Asar Mat Lena…

ఉన్ కి బాతోంకా జరాసాభి అసర్ మత్ లేనా,

(వారి మాటలకు కొంచం కూడా స్పందిచవద్దు)




Warna Chehre Ke Tasur Se Samajh Jayenge

వర్న చేహేరే కె తాసుర్ సే సమఝ్ జాయెంగే,

(లేకపోతే నీ మొహంలో మారుతున్న భావాల్ని పసిగడతారు)





Chahe Kuch Bhi Ho, Sawaalat Na Karna Unse (2)

చాహే కుఛ్ భీ హొ సవాలాత్ నా కర్ నా ఉన్ సే,

(ఏం జరిగినా గానీ, వాళ్ళని ఏ ప్రశ్నలూ అడగకు)




Mere Baare Mein Koi Baat Na Karna Unse

మేరే బారే మే కోయి బాత్ నా కర్ నా ఉన్ సే,

(నా గురించి ఏ ప్రస్తావనా తీసుకురాకు, వాళ్ళ దగ్గర )




Baat Niklegi To Phir…Door Talak Jayegi

బాత్ నిక్ లేగి తో ఫిర్ దూర్ తలక్ జాయేగీ!!

(విషయం,మాట బయటకి వస్తే, చాలా దూరం వెళ్తుంది!!)



అర్ధం కానీ పదాలు పోష్ మాల్ లో చూశాను, వారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఇందులో నాకు అర్ధమైన భావాన్ని 

నేను రాశాను. ఇంతకు మించిన భావం కానీ, నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదని కానీ అనిపిస్తే, మీకు అర్ధమైన 

విషయం చెప్పండి!!



అర్ధం ఐనా కాకపోయినా వినదగ్గ గజల్ ఇది!!!

Sunday, December 29, 2013

ఒక మంచి పాట.

కొన్ని పాటలకు ఒక నోస్టాల్జిక్ వాల్యూ ఉంటుంది. 

నాకు అలాంటి ఒక నోస్టాల్జిక్ వాల్యూ ఉన్న ఘజల్  "దీవారోంసే మిల్ కర్ రోనా". ఈ పాటని "పంకజ్ ఉధాస్"  గారు ఆలపించారు.

నేను విన్న తొలి ఘజల్స్ కాసెట్ పంకజ్ ఉధాస్ గారు పాడిన ఘజల్స్ కాసెట్టే. అందులో నాకు చాలా ఇష్టమైన ఘజల్ ఇది. "కైసర్ ఉల్ జాఫ్రీ"  కలం నుంచి జాలువారిన వేదనా భరితమైన ఘజల్. ఘజల్ స్వరూపం లో నే కొంత పెయిన్ ఉంటుంది అనుకుంటాను. (ఆ గోడల్ని పట్టుకుని ఏడవటాలు, పిచ్చివాళ్లు కావటాలూ, ఇడెక్కడి గోలే? కాస్త మంచివి, ఎవరన్నా అడిగితే పాడటానికి వీలుగా ఉండేవి "భావయామి గోపాలబాలం" లాంటి పాటలు వినొచ్చు కదా అని తిట్టేవాళ్లు కూడా ఇంట్లో. రోజంతా ఇంట్లో ఇదే మోగుతుంటే వాళ్ళకి మాత్రం విసుగు పుట్టదా? నాకు కొత్త కాబట్టి ఇంట్లో ఉన్నంత సేపూ ఈ కేసెట్టే వినేదాన్ని.)

ఘజల్స్ లో ఒక అందం ఉంటుంది, సౌకుమార్యం ఉంటుంది, ఒక వేదన ఉంటుంది, ఒక విరహం ఉంటుంది, ఒక ప్రేమోన్మాదం ఉంటుంది, ఒక రస ప్లావితమైన హృదయం ఉంటుంది. ఉర్దూ లోనూ, అరబిక్ లోనూ ప్రతి భావనకీ ఒక పదం ఉంటుంది అంటారు. నేను నెట్ లో మీనింగ్స్ వెతుకుతూ అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఏనాటికైనా ఉర్దూ నేర్చుకుని ఘజల్స్ పూర్తిగా అర్ధం చేసుకోగలిగితే ఎంత బావుంటుందో....(ఇదో కాశ్మీరం...ఇంతకు ముందు నేను రాసిన కాశ్మీర తీరాలు లో లాగా...) 

పైన చెప్పిన ఘజల్ లో ఒక ఒంటరి తనము, మనసును కలచివేసే భావన ప్రవహిస్తుంటాయి. సింపుల్ గా, హాయిగా ఆలపించారు పంకజ్ ఉధాస్ గారు. 



Deewaron se milkar rona achcha lagta hai
Hum bhi paagal ho jayenge aisa lagta hai

దీవారోంసే మిల్ కర్ రోనా  అచ్ఛా లగ్ తా  హై,
హామ్ భీ పాగల్ హోజాయేంగే ఐసా లగ్ తా హై.


Duniya bhar ki yadein humse milne aati hain
Shaam dhale iss soone ghar mein mela lagta hai
Hum bhi paagal ho jayenge aisa lagta hai
Deewaron se...

దునియా భర్ కే యాదేన్ హామ్ సె మిల్ నే ఆతీ హై 
షామ్ ఢలే ఇస్ సూనే ఘర్ మే మేలా లగ్ తా హై 
హామ్ భీ పాగల్ హోజాయేంగే  ఐసా లగ్ తా హై

Kitne dinon ke pyase honge yaron socho to
Shabnam ka qatra bhi jinko dariya lagta hai
Hum bhi paagal ho jayenge aisa lagta hai
Deewaron se...

కిత్ నే దినోంకే ప్యాసే హోంగే యారోన్ సోచో తో 
షబ్నమ్ కా కతరా భీ జిన్ కొ దరియా లగ్ తా హై 
హామ్ భీ పాగల్ హోజాయేంగే  ఐసా లగ్ తా హై

Kisko 'qaisar' patthar marun kaun paraya hai
Sheesh mahal mein ik-ik chehra apna lagta hai
Hum bhi paagal ho jayenge aisa lagta hai
Deewaron se...

కిస్ కో కైసర్ పత్తర్ మారూన్ కౌన్ పరాయా హై
షీష్ మహల్ మే ఇక్ ఇక్ చెహెరా అప్ నా లగ్ తా హై 
హామ్ భీ పాగల్ హోజాయేంగే  ఐసా లగ్ తా హై

విని మీరు కూడా ఆనందిస్తారని అనుకుంటున్నాను.

Sunday, November 17, 2013

నాకు నచ్చిన సినిమా!! Still Walking(2008) Japan.

నాకు నచ్చిన సినిమా!!









సినిమా పేరు : స్టిల్ వాకింగ్ : 2008
భాష : జాపనీస్
డైరెక్టర్ : హిరోకాజు కొరీడా./ Hirokazu Koreeda.


ఈ సినిమా నేను చూసిన మొట్టమొదటి జపనీస్ సినిమా.

చాలా అందమైన సినిమా. సినిమాలో లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ చెట్లూ, ఆ పక్షుల కూజితాలూ,ఆ సముద్రం.... అసలు ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే, ఇలాంటి చోట మనం ఉంటే ఎంత బావుండునో కదా అనిపించేలా ఉంది.

మ్యూజిక్ ఎంత ఉండాలో అంత, తూకం వేసినట్టు అమర్చారు. ఇందులో వినిపించే పాట "Blue Lights of  Yokohama" చాలా హృద్యంగా వినిపిస్తుంది.

ఇక కథ చాలా సింపుల్ కథ. ఒక కుటుంబం, తల్లి తండ్రీ (కొంచం వయసు మళ్లిన), వాళ్ళ పిల్లలు ముగ్గురు - ఇద్దరు కొడుకులు (ఒక కొడుకు చనిపోయి ఉంటాడు), ఒక కూతురు, వాళ్ళ కుటుంబాలు. పిల్లలు తలిదండ్రుల దగ్గరికి వస్తారు, పెద్ద కొడుకు  మరణించిన రోజు అందరూ కలిసి అతనిని స్మరించుకోవాలీ, తమ రెస్పెక్ట్స్ పే చెయ్యాలి అని. రెండో కొడుకు ర్యోటో, తన భార్య (ఆమెకిది రెండో పెళ్లి, ఒక పదేళ్ళ కొడుకు ఉంటారు) తో వస్తాడు. వాళ్ళు తమని ఈ కుటుంబం స్వాగతిస్తుందా, లేదా  అన్న టెన్షన్ లో ఉంటారు. కూతురు చినమీ, భర్త ఇద్దరు పిల్లలు, అక్కడ ఆ ఇంట్లో ఒక పోర్షన్ తమకు ఇస్తే బావుండు అన్న ఆలోచనతో వస్తారు. భర్త ఆధిపత్యంలో జీవితాన్ని గడిపిన తల్లి. వీళ్ళ మధ్య కనబడీ కనబడకుండా టెన్షన్స్.

ప్రపంచంలో అన్నిచోట్లా (దేశ కాలమాన పరిస్థితులు ఏవైనా గానీ) ప్రతి కుటుంబంలో ఇవే టెన్షన్స్!!

నాకనిపిస్తుంది, మనమంతా మానవ సంబంధాల చట్రంలో ఒక్కటే...మన  సమస్యలన్నీ మౌలికంగా ఒక్కటే, కొద్దో గొప్పో తేడాతో. తండ్రీ కొడుకుల మధ్య దూరం, భార్యా భర్తల మధ్య కనిపించని దూరం, ఆశ, కోపం, నిస్పృహ, మమకారం, ప్రేమ, ద్వేషం. ..వీటి అన్నిటినీ అతి సహజంగా చూపించారు కొరిడా గారు.

చనిపోయిన కొడుకు గురించి కాకుండా బ్రతికున్న తమ గురించి ఆలోచించవచ్చుకదా అన్న ఆక్రోశం కూతురిది ఐతే, తనను పెద్దకొడుకుతో పోల్చి , కేవలం ఒక డాక్టర్ కానందుకు  అసలు ఎందుకూ పనికి రానివాడు అన్నట్టు ఎందుకు ట్రీట్ చెయ్యలీ అని రెండో కొడుకు బాధ. భర్త ఎవరితోనో సన్నిహితంగా ఉన్న సంగతి గమనించినా, తన బాధని మనసులోనే దాచుకుని మౌనం వహించిన తల్లి, ఆ విషయం తను ముసలివాడైయ్యాక తెలుసుకుని ఆశ్చర్యపడి, చలించే భర్త.....అన్నీ తెలిసినవే, విన్నవే, చూసినవే...కానీ అన్నీ చాలా సున్నితంగా తెరకి ఎక్కించిన తీరు మనల్ని గెలుచుకుంటుంది.


అంతే కాదు, ఇందులో మనకు జపనీస్ ఇళ్లూ, వాళ్ళ పద్దతులూ, వాళ్ళ  మర్యాదలూ పరిచయం ఆవుతాయి. భిన్నమైన మనుషులూ, వాతావరణాలూ, సంస్కృతులూ...చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది చూస్తూ ఉంటే. ఇంకో కొత్త ప్రపంచపు ద్వారాలు కొద్దిగా తెరుచుకున్నట్టుగా అనిపించింది. ఒకప్పుడు ఒక పుస్తకం చదివి సమురాయ్ (జాపనీస్ యోధుల)  గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయాను. అందుకే, ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి సినిమా చూసినా కొత్త విషయాలు తెలుసుకోవటం, మనుషుల్లోని కొత్త కోణాల్ని తెలుసుకోవటం జరుగుతుంది అని, అవి మన ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తాయని నేను అనుకుంటాను.

నాకు నచ్చింది ఈ సినిమా...