Hour Glass - Time,Memory Marriage (2017)
By Dani Shapiro
డానీ షపీరో అనే అమెరికన్ రచయిత్రి, ఇప్పటివరకూ అయిదు నవలలూ, రెండు మెమాయిర్స్ రాసారు. ఆత్మకథల వరసలో ఇది మూడో తాజాపుస్తకం.
తన 18 యేళ్ళ వైవాహిక జీవితం, అందులోని ఒడిదుడుకులు; పరిస్ఠితుల్లో, వ్యక్తుల్లో, వ్యక్తిత్వాల్లో కలిగే మార్పులూ - వీటన్నింటి గురించి నిజాయితీగా రాసిన పుస్తకం ఇది. ఒకరికొకరు అన్న నేపథ్యంలో, భార్యా భర్తా ఇద్దరూ ఎంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్నీ కోల్పోతారు? ఎంత మార్పుకు గురౌతారు? తమలో కలిగిన మార్పునీ, అవతలి వ్యక్తిలోని మార్పునీ ఎలా తీసుకుంటారు? జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఒకరికొకరు ధైర్యాన్నిచ్చుకుంటారు? తలిదండ్రులు, అత్తామామలు, భయాలూ, కష్టాలూ, ఆనందాలూ, అనారోగ్యాలూ, చావూ, పుట్టుక, గెలుపు, ఓటమి, దైనందిన జీవితం - ఇవన్నీ కలగజేసే ఉద్వేగాల, వైరాగ్యాల, అనుభూతుల శకలాలు మనస్సుకీ బుద్ధికీ ఎలాంటి పరిణతిని లేక సంయమనాన్నీ కలగజేస్తాయి అన్న చర్చకు తెరలేపటం బావుంది. పుస్తకంలో ఒకచోట ఒక చక్కటి ప్రస్తావన తెస్తారు రచయిత్రి : "What must we summon and continue to summon in order to form ourselves toward, against, alongside another person for the duration? To join ourselves to the unknown? What steadfastness of spirit? What relentless faith?"
కుటుంబంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తులు, తలితండ్రులు, భార్యాభర్తలూ, పిల్లలూ - ఒకరికొకరు ఎంత తెలుసు? అంతెందుకు - మన గురించి మనకు ఎంత తెలుసు? మనలో మనం ఎన్ని రూపాలు ధరించి ఉన్నాం? మనలో మనం ముక్కలుగా, ఎన్ని రకాలుగా విడిపొయి ఉన్నాం? ఒకప్పటి మనకి, ఇప్పటి మనకి మధ్య కరిగిపోయిందేమిటి, మిగిలింది ఏమిటి? ఈ రెంటికీ వంతెనలా ఉన్న మనుషులూ, పరిస్థితులూ, ఆ ఛాయా చిత్రాలూ ఎన్ని మరుపు తెరలలోకి జారుకున్నాయి? మనం మనలా ఎంత మిగిలాం, ఎంత మార్పుకు గురి అయ్యాం లాంటి మౌలిక ప్రశ్నలు మనకు ఎదురౌతాయి ఈ పుస్తకంలో.
"I am on my chaise, journals all over the floor, trying to gather my whole lost tribe of selves around me." - కోల్పోయిన రూపాలని పోగేసుకోవడం కూడా, ధరించబోయే రూపాలకి కొంత శక్తినీ, స్థైర్యాన్నీ, ఆలోచననీ కలగజేస్తుంది!
కాకపోతే ఇది జీవిత చరిత్ర కాదు, ఒక మెమాయిర్. తన వైవాహిక జీవితంలోని కొన్ని సంఘటనలను, గుర్తులనూ కలబోసి తన ఆలోచనలను మనతో పంచుకోవటమే ఇందులో జరిగింది. రచయిత్రి తనకు తను దూరంగా నిలబడి తన జీవితాన్ని చూసే, చూపే ప్రయత్నం బావుంది. ఆ ప్రయత్నంలో మనల్ని తనకూడా నడిపించటం, అలోచన రేకెత్తించటం బావుంది.
పుస్తకం గట్టిగా వందపేజీలు కూడా లేదు. కానీ చాలా ప్రశ్నల్ని రేపుతుంది!
మీరూ చదివి చూడండి!

No comments:
Post a Comment