Sunday, January 1, 2012

ఇవాళ ఆదివారం.. జనవరి ఒకటో తారీకు.....2012 !!

ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్లాగ్ ఎవరూ చదవరు కదా శుభాకాంక్షలు ఎవరికీ అంటే? ఏమో ఎవరైనా చూస్తారేమో , ఏమో ....గుర్రం ఎగరవచ్చు అన్నట్టు సడన్ గ బ్లాగ్ చాలామందే చూస్తారేమో??? నూతన సంవత్సరం నే బ్లాగ్గింగ్ తెగ చేస్తానేమో? నా బ్లాగ్ కి కూడా followers ఉంటారేమో? నేను నిరంతర ఆశాజీవిని ( నిరంతర వార్తాస్రవంతి లాగా   అంటారా).

జోకులు పక్కనపెడితే, నేను ఈ సంవత్సరం నా రైటింగ్ స్కిల్ల్స్ అనగా రాతకోతలు (ఏదో రాయటం అది బాగాలేదని కోయటం ఎక్కువవుతోంది ..అంతా రాత + కోత లా ఉంది తప్పితే పబ్లిష్ అన్న కీ వరకు రావట్లేదు నా ప్రయోగాలు)
ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకొంటున్నాను. Let me see :))

వేదం సినిమాలో సిరివెన్నెల గారి పాట గుర్తుకొస్తోంది.

"పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు లేనట్టే
ఇక్కడనే ఉంటె ఉండీ లేనట్టే
Now or Never "

సో అలా కనీసం అప్పుడప్పుడు బ్లాగ్ చెయ్య దలుచుకున్నా. సన్నజాజి పూల పరిమళ మే పలకరిస్తుందో , Reiki energy పలకరిస్తుందో, గుభాళించే మల్లె సుగంధం పిలుస్తుందో, cooker whistle వినిపిస్తుందో, పరేషాన్ రాత్ సారీ అని ghazal వినిపిస్తుందో. ఎం ఎస్ విశ్వనాథన్ పాటలు ఎస్ రాజేశ్వరరావు పాటలు వినిపిస్తాయో....

ఇవాళ మాత్రం ఒక అద్భుతమైన poem తో ముగిస్తున్నాను.

 

A blade of grass                                                                                  K.Gibran

 

Said a blade of grass to an autumn leaf, "You make such a noise falling! You scatter all my winter dreams."
Said the leaf indignant, "Low-born and low-dwelling! Songless, peevish thing! You live not in the upper air and you cannot tell the sound of singing."
Then the autumn leaf lay down upon the earth and slept. And when spring came she waked again -- and she was a blade of grass.
And when it was autumn and her winter sleep was upon her, and above her through all the air the leaves were falling, she muttered to herself, "O these autumn leaves! They make such a noise! They scatter all my winter dreams."

  








No comments:

Post a Comment