బమ్మిడి జగదీశ్వరరావు గారు రాసిన "తెగిన గొళ్ళాలు" కథ
ముగింపు వాక్యాలివి:
"…..తలుపుల గొళ్ళాలు తెగలేదు.
కాని ఎక్కడో మరేవో గొళ్ళాలు – అవి తెగిపోయాయి. "
మనుషుల అనుబంధాల గురించి చక్కగా రాసారు ఈ కధలో .
అక్క
చెల్లెళ్ళ మధ్య బంధం ఎంత గట్టిదో, అంతే మెత్తగా
పుటుక్కుమని ఎలా తెగిపోతుందో బాగా చూపించారు.
రోజూ మన ఇళ్ళళ్ళో కనిపించే అతి సామాన్యమైన
విషయాలే మనముందు ఉంచారు. కుటుంబ సంబంధాలు,
డబ్బు
వల్ల కలిగే విభేదాలూ, అనురాగాలూ,ఆప్యాయతలూ ..ఇంతలోనే
తెగి పోయే బంధాలు - బంధుత్వాలు. ఇంతే !
కానీ
కథ చదివాక మాత్రం ఎందుకో "అయ్యో ఇలా
ఎందుకయ్యింది?" అనిపించక మానదు.
మంచి కథ
కాబట్టే "రెండు దశాబ్దాలు కథ 1990-2009" లో
చోటు సంపాదించుకో గలిగింది ఈ కథ!
No comments:
Post a Comment