నాలో నేను..
దిగంతాలు జారిపోతున్నై, వసంతాలు తరలి పోతున్నై...
ప్రతి ఉదయం రాత్రి లోకి మారిపోయి, రోజులు గడిచిపోతున్నై!
నిన్నల్లో నేడుల్లో గతం మిగిలిపోతోంది.
పసితనం నుంచి ఎదిగి ప్రౌఢ దశను మించిపోయి ,
కదలిపోతున్న కాలంలో కలసిపోతున్నా ...
ఇంతవరకు నాకు ఏంకావాలో తెలుసుకోలేదు,
ఇంతవరకు నా గమ్యం ఏమిటో తెలీదు...
అసలు నేనేమిటో నాకు ఇంకా తెలీదు.
ఇంక ప్రపంచం గురించి ఏం తెలుసుకొను?
ఇంకో మనిషి గురించి ఏం తెలుసుకొను?
ఇలా ఏమి తెలియనితనంలో ఈ పరుగు
ఎందుకో? ఎక్కడికో?
Tuesday, June 28, 2011
Sunday, June 12, 2011
నం పా సా..నందూరి పార్ధసారధిగారు. ఆయన రచించిన " రాంబాబు డైరీ " ఓ రసగుళిక.
నం పా సా..నందూరి పార్ధసారధిగారు. ఆయన రచించిన " రాంబాబు దైరీ " ఓ రసగుళిక.
మనసుని ఆహ్లాద పరిచేలా ఒక మాట మాట్లాడటమే కష్టం, అలాంటిది ఓ పుస్తకం రాయాలంటే?అదీ అద్భుతంగా, జనాల్ని మెప్పించేలా రాయటం అంత సులువు కాదు.
అత్యంత అద్భుతంగా రాసి మెప్పించటం పార్ధసారధిగారి రచనా నైపుణ్యాన్ని సూచిస్తుంది. నా ఉద్దేశంలో ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. హాస్యాన్ని ఆస్వాదించే ప్రతిఒక్కరూ "తప్పకుండా" చదవవలసిన పుస్తకం. పుస్తకం నిండా చమక్కులే. రాంబాబు పాత్ర ఎంత అద్భుతంగా మలచబడింది అంటే మన రొటీన్లో అతను ఏదో ఓ రూపంలో గుర్తుకోస్తూనే ఉంటాడు. తెలుగు జర్నలిజంలో ఓ వెలుగు వెలగాలని కలలు కనే రాంబాబు డైరీలో, మచ్చుక్కి ఓ చిన్నిభాగం సరదాగా ...
" ఏమిటో ఈ కాలంలో నినాదాలు తీవ్ర పర్యవసనాలకు దారితీసేవిగా కనిపిస్తున్నాయి. 'దున్నేవాడిదే భూమి' అంటున్నారు రైతులు. అంటే వ్యవసాయం చాతైన వారికే భూమి వుండాలని తాత్పర్యం. బాగానే ఉంది.కాని రేపు రజకులు 'ఉతికే వాడిదే బట్ట' అని పేచీ పెట్టవచ్చు. ఎల్లుండి నాయీ బ్రాహ్మణులు 'గొరిగేవాడిదే తల' అని వాదించరని గారంటీ ఏమిటి? ....ఇటువంటి పిదప కాలం వస్తుంది అనే మహా పురుషులు ఎలేక్ట్రిక షేవర్లు,వాషింగ మెషిన్లు కనిపెట్టారు. (నాకు ఇంతటి ఒర్జినలు ఐడియాలు వస్తున్టే హర్షించెవాళ్ళే లెరు కదా ! మనదేశంలో ప్రతిభకు తగిన పరిగణన లేదు.అందుకే గొప్ప విజ్ఞానులందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. స్వదేశంలో ఉండే యోగం నాకూ ఉన్నట్టు లేదు."
రాంబాబు వర్సటాలిటికి పరిధుల్లేవు.ఫిలాసఫీ,సంగీతం,క్రికెట్,సినిమా,సామాజిక స్పృహ,గ్లామర్,...
Everything under the sun becomes a matter of interest to him.
Hats off to the creator of Rambabu.
ప్రస్తుతానికి ఇంతే.రాంబాబు జర్నలిజం నేర్చుకున్నట్టు ఉంది నేను టైపు చెయ్యటం. ఈ కాస్త టైపు చెయ్యటానికి గంటన్నర పట్టింది. ఇక భోజనాలకి లేవకపోతే ఆకలి కేకలు ఆవేశపు బాట పట్టి ఇంట్లో యుద్ధకాండ మొదలైతే కష్టం!

Subscribe to:
Posts (Atom)