Tuesday, November 16, 2021

Reflections


My thoughts on the play, Waiting for Godot

Samuel Beckett 








Paradoxically, ‘Waiting for Godot’ is a brilliant drama where nothing really happens. From that nothingness spring questions that are of utmost importance to mankind, which go on to haunt the reader. ‘Godot’ set at the vortex of the play, is not actually seen anywhere in the play - while a set of people hopelessly bound to him, are sucked into this vortex and are held there without any respite. The play written by Samuel Beckett (Beckett translated his own work written in French in 1948 into English later in 1952-53) depicts post Second World War desolateness and the existential qualms that festered all those who survived the tragedies of the war. 


Written in two acts, the story is all about Estragon (Gogo) and Vladimir (Didi) waiting to meet Godot who never turns up. These two people meet Pozzo and his slave Lucky, while they wait. Becket is realistic about the toughness in life, and does not venture to offer closures to the situations of his characters. The taut conversations that happen between Estragon, Vladimir and Pozzo are wrought with serious implications. 

The play consists of two acts and two sets of two people, and the character of Godot who never appears but is the central character around whom the story evolves. Beckett’s main characters Estragon and Vladimir, are referred to as Gogo, and Didi by each other - an interesting coinage of words where two letters get repeated in both the names. Two acts, two pairs of characters, along with certain dialogues being repeated twice - throw light on the inherent dualism present in the life of mankind.


Minimalistically terse (“They talk about their lives… To have lived is not enough for them… They have to talk about it”), lyrically poetic (“They make a noise like wings… like leaves… like sand…”), free of verbosity (“But habit is a great deadener”) and subtly humorous (“Boots must be taken off every day, I'm tired telling you that”) the language of Beckett beckons the reader to become aware of human suffering and captivates him. The play opens with a simple dialogue by Estragon, “Nothing to be done” with a finality that makes one sit up and pay attention to these words. This is followed by the brooding of Vladimir: “I’m beginning to come round to that opinion. All my life I’ve tried to to put it from me, saying Vladimir, be reasonable, you haven’t yet tried everything. And I resumed the struggle.” The heaviness of the subject is made pliable through the simplicity of the language and its razorlike sharpness. The repetition of dialogues, used as a technique almost throughout the play makes the reader pause and look at the meaning the writer intends the reader to take notice of. There is a situation where Estragon’s feet hurt because of his shoes and he talks harshly to Vladimir and gets a stinging retort from him. Check out this interaction that takes place between them: 

“Vladimir: It hurts?

Estragon: (Angrily) Hurts! He wants to know if it hurts!

Vladimir: (angrily) No one ever suffers but you. I don’t count. I’d like to hear what you’d say if you had what I have.

Estragon: It hurts?

Vladimir: (angrily) Hurts! He wants to know how it hurts!” 

The issue of suffering shifts here from Estragon to Vladimir. This flip-over achieved by Beckett easily and unobtrusively calls the reader’s attention to the core issue of how unaware one can be of another person’s suffering.


The play depicts, indefinite waiting for things that may not happen at all (“Nothing happens, nobody comes, nobody goes, it’s awful!”); poverty and hunger; being lost in one’s own world (“But habit is a great deadener”, “Was I sleeping, while the others suffered?”); a desperate need to communicate; need for companionship (“Yes, the road seems long when one journeys all alone…”, Don't touch me! Don't question me! Don't speak to me! Stay with me!”); suicidal thoughts and self-centeredness; suffering, hope and hopelessness (“To every man his little cross… Till he dies… And is forgotten”, “Down in the hole, lingeringly, the grave digger puts on the forceps. We have time to grow old… “); and a great sense of endurance. Religion is questioned seriously, by asking if one needs to believe everything that is told without raising questions. Pozzo when questioned about his blindness gets angry and the tirade that ensues about time is startling when he furiously says, “Have you not done tormenting me with your accursed time! It’s abominable! When! When! One day, that is not enough for you, one day he went dumb, one day I went blind, one day we’ll go deaf, one day we were born, one day we shall die, the same day, the same second, is that not enough for you? They give birth astride of a grave, the light gleams an instant, then it’s night once more…” The loud thinking of slave Lucky when he is commanded to think, is a moment of precious freedom for him from the drudgery of slavery and oppression. Thoughts come tumbling, clogging his mind and his speech is muddled.  One cannot but think about the rampage of thoughts in human mind where thoughts overlap and clarity is lost. The characters of Estragon and Vladimir portrayed as forgetful and confused about what is happening in their lives has a strong semblance to mankind’s struggle to come to terms with life and understand it. Despite all the hopelessness that is obvious in the play, one can feel that there is a stoic endurance as an undercurrent giving a ray of hope that life may find a meaning after all – the greatest indication being that Estragon and Vladimir continue to wait, without giving up hope. 


Much has been written about this play, and much reveals itself afresh with every read. A differently and a powerfully written play which you end up reading non-stop! Maybe if you pick it up and go for it, you may like it as much as I did!


Sunday, May 30, 2021

నాకు నచ్చిన పుస్తకం - Notes on Grief, Chimamanda Ngozi Adichie



Notes on Grief

By Chimamanda Ngozi Adichie

*****


“I am writing about my father in the past tense, and I cannot believe I am writing about my father in the past tense.” రచయిత్రి ‘చిమమండా ఎంగోజీ అడీచి’ రాసిన ‘నోట్స్ ఆన్ గ్రీఫ్’ పుస్తకంలోని వాక్యాలివి.  

ఒక వ్యక్తి మరణానంతరం ఆ కుటుంబంలోని వ్యక్తులు దాన్నెలా తట్టుకుంటారన్నదానికి కొలమానాలు లేవు. ఆ బాధని ఎలా వ్యక్తీకరిస్తారన్నదానికి వ్యాకరణాలూ లేవు. భావోద్వేగాలు అభివ్యక్తీకరించే వ్యక్తుల్లో, పద్ధతుల్లో  భిన్నత ఉన్నా, అంతర్లీనంగా అందరూ అనుభవించే దుఃఖం  ఒక్కటే. ప్రస్తుత పాండెమిక్ సమయంలో మరణవార్తల గురించి ఎక్కువగా వింటున్నాం. అలాంటప్పుడు మరణం, అది కలిగించే దుఃఖం గురించిన పుస్తక పరిచయం ఇప్పుడు అవసరమా అనిపించినా, ఈ చిన్న పుస్తకం చదివాక(ఎనభై పేజీలే), నాలుగు వాక్యాలు రాయాలనే అనిపించింది. 

కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో, పోయిన సంవత్సరం జూన్‌లో, ఎనభైఎనిమిదేళ్ల తన తండ్రి మరణించడం (కరోనా వల్ల కాదు) రచయిత్రికి ఒక షాక్. ఆత్మకథగా సాగే ఈ పుస్తకంలో ఆమె తన తండ్రి మరణాన్ని ఒప్పుకోలేకపోవటం, అనుభవించిన దుఃఖం, మానసిక సంఘర్షణ,  తండ్రితో ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలూ ఇంకా మరెన్నో ఇతరత్రా విషయాల గురించి ప్రస్తావిస్తుంది. గ్రీఫ్‌కి ఉండే ముఖ్యమైన అయిదు దశలూ - Denial, Anger, Bargaining, Depression and Acceptance - ఇందులో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక రూపంలో, తన అనుకున్న వారిని కోల్పోయిన బాధని అనుభవించే ఉంటాడు. అంచేత ఈ పుస్తకంలో కనిపించిన బాధ సార్వత్రికమూ, సార్వకాలికము.

వివిధ దేశాల్లో ఉన్న తమ తోబుట్టువులంతా కలిసి నైజీరియాలో ఉన్న తండ్రితో జూమ్‌కాల్‌లో మాట్లాడినప్పుడు ఉత్సాహంగా మాట్లాడిన ఆయన, మూడు రోజుల తరవాత ఇక లేరని తెలుసుకోవటం అడీచి నమ్మలేకపోయిన విషాదం. “The news is like a vicious uprooting. I am yanked away from the world I have known since childhood.” చిన్నప్పటినుంచీ తనకు తెలిసిన ప్రపంచాన్ని తననుంచి, సమూలంగా వేర్లతోసహా పెకిలించివేసినట్టయింది. తను పెరిగిన ప్రపంచం, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసిన తండ్రి, అతనితో ఉన్న అనుబంధం, అతని మరణాన్ని తొందరగా ఒప్పుకోనివ్వవు.  

‘మౌర్నింగ్ పీరియడ్’ ఓ పరీక్షాకాలం. తనవారిని కోల్పోవడాన్ని ఒప్పుకోని మనసూ, తెగని వేదన, ఓదార్పునివ్వని సన్నిహితుల మాటలూ, ఆగని దినచర్యలు, నిర్వహించాల్సిన క్రతువులూ, విధులూ కన్నీటి స్పర్శతో తడిబారతాయి. “Grief is a cruel kind of education. You learn how ungentle mourning can be, how full of anger. You learn how glib condolences can feel.” శోకాన్ని భరించలేని, మరణాన్ని ఒప్పుకోలేని హృదయం, ఎందుకిలా జరిగింది అన్న కోపానికీ  తావిస్తుంది. ఆ కోపం - నవ్వుతూ, తుళ్లుతూ మామూలుగా ముందుకెళ్తున్న ప్రపంచంపైనా, భగవంతుడిపైనా, తనపైనా, హఠాత్తుగా వెళ్లిపోయిన వ్యక్తిపైనా, ఓదార్పుమాటలు చెప్పేవారిపైనా - అన్నింటిపైనా ఉంటుంది. తండ్రి మరణం  కలిగించిన కోపం, భయం వీటిని చూసి సిగ్గుపడేది రచయిత్రి. పోస్ట్‌మాన్ రావటం, సభలలో మాట్లాడమని తనకు ఆహ్వానాలు అందటం చూసినప్పుడు “నా హృదయం ముక్కలుచెక్కలైపోయి ఉంటే, ఈ ప్రపంచమంతా ఏమీ జరగనట్టు ఇలా మామూలుగా ఎలా జరిగిపోతోంది?” అన్న అర్థంకాని ప్రశ్నలు ఆమెలో మెదిలేవి. తండ్రిని కోల్పోయిన బాధలోంచి నిస్సహాయంగా పుట్టిన కోపం ఒంటరితనాన్ని కోరుకున్నా, ఎవరినీ చూడటానికీ, ఫోన్లలో మాట్లాడటానికీ, జవాబులు ఇవ్వడానికి ఇష్టపడకపోయినా, ఓదార్పు మాటలు శుష్కంగా, వ్యర్థంగా అనిపించినా అవన్నీ బాధలోంచి పుట్టినవే. తనని ఓదార్చటానికి వచ్చిన వాళ్ల సహృదయత, కరుణ  అర్థమవుతూనే ఉంటుంది, కానీ ఓ ఉదాసీనత చుట్టుముడుతుంది. “How facile to preach about the permanence of death, when it is, in fact, the very permanence of death that is the source of anguish. I wince now at the words I said in the past to grieving friends. ‘Find peace in your memories,’ I used to say. To have love snatched away from you… and then to be told to turn to memories. Rather than succour, my memories bring eloquent stabs of pain that say, ‘This is what you will never again have.’” 

మరణించిన వ్యక్తి గురించి మాట్లాడుకోవటం, అతని హాస్యప్రియత్వాన్ని తలుచుకుని నవ్వుకోవడం సహజమే. అలా నవ్వే క్షణాల వెనకే అంతులేని బాధకూడా పొంచి ఉంటుంది. “Another revelation: how much laughter is a part of grief. Laughter is tightly braided into our family argot, and now we laugh remembering my father, but somewhere in the background there is a haze of disbelief.” జ్ఞాపకాలు ఒకోసారి నవ్వుతెప్పించినా అవి నొప్పితో రాజుకుంటున్న నిప్పుకణికల్లా ఉండి క్షణాల్లో ఆ నొప్పి ప్రజ్వరిల్లే జ్వాలగా మారిపోయేది.  మరణించినవారి జ్ఞాపకాలు మధురంగా ఉండి ఆనందం కలగచేయటానికి  చాలా సమయం పడుతుంది, బహుశ కొన్ని ఏళ్లే పట్టొచ్చు.  

శోకం కేవలం మానసికమే కాదు, శారీరకం కూడా. “This is an affliction not merely of the spirit but of the body, of aches and lagging strength. Flesh, muscles, organs are all compromised. No physical position is comfortable. For weeks, my stomach was in turmoil, tense and tight with foreboding…” దుఃఖం శరీరంలోని ప్రత్యణువులోనుంచీ వెల్లువెత్తుతోందా అనిపించేలా శరీరం అలసిపోతుంది. “Why are my sides so sore and achy? It’s from crying, I’m told. I did not know that we cry with our muscles. The pain is not surprising, but the physicality is…” 

తండ్రిలోని నిజాయితీ, సూటిదనం, సహాయం చేసే గుణం, సర్దుకుపోయే తత్వం, ఎదుగుతున్న పిల్లల్ని అర్థం చేసుకుని మార్పుని ఒప్పుకునే మనసూ, పిల్లల్ని స్వతంత్రంగా ఎదగనిచ్చిన తీరూ, అభిప్రాయ వ్యక్తీకరణకు ఇచ్చిన స్వేచ్ఛ, తల్లికీ తండ్రికీ మధ్యనున్న అపరితమైన నిష్కల్మషమైన ప్రేమ, నమ్మకం, జీవితం పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథం, విజ్ఞత, మనుషుల పట్ల ప్రేమ, ఆయనలో చికాకు పెట్టే విషయాలూ, కరోనా పరిమితులవల్ల ఆయన మరణించిన వెంటనే నైజీరియా చేరుకోలేని నిస్సహాయత, నిర్వహించవలసిన విధులూ, అందులోని సామాజిక కోణాలూ, ఒప్పుకోలేకపోయినా ఒద్దనలేని క్రతువులూ - వీటన్నిటీగురించీ హృద్యంగా ప్రస్తావిస్తారు రచయిత్రి. 

తనని సమూలంగా కుదిపేసిన బాధని అలతి పదాల్లో చెప్పడం వల్ల అడీచి బాధలో నిజాయితీ కనిపిస్తుంది. భాషలో ఎక్కడా క్లిష్టత, బరువైన భావుకతా, పటాటోప ప్రయోగాలూ, అనవసరమైన  అలంకారాలూ కనిపించవు. చిన్న వాక్యాలూ, చిన్న అధ్యాయాలూ ఉండే అతి సన్నని పుస్తకం విషయంలోకి సూటిగా వెళ్లిపోయేలా చేస్తుంది. భాష, శైలిపై రచయిత్రికి ఉన్న పట్టు, సామర్థ్యం మరోసారి ఈ పుస్తకం ద్వారా ప్రకటింపబడింది. 

ఎదురైన చేదు అనుభవాన్ని కొంత దూరంనుంచి చూస్తూ, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ, సలపరిస్తున్న బాధని సరళమైన భాషలోకి అనువదించిన ఇలాంటి రచనల పట్ల ఆసక్తి ఉన్నవారు, ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే.  

******




Saturday, April 17, 2021

తడి జ్ఞాపకం

 



జీవితంతో నిత్యపోరాటం చేస్తూ అలసిపోయిందని ఆమెను చూడగానే తెలిసిపోతుంది. కళ్లల్లో అలసట కనిపిస్తూనే ఉంటుంది. ఆమె కట్టుకున్న చీర రంగు తెలీనంతగా వెలిసి, ముతగ్గా లెక్కలేనన్ని ముడతలలోకీ అతుకులలోకీ ఒదిగిపోయింది - ముఖం మీద పడుతున్న ముడతలతో, కళ్లల్లో నిండిన అలసటతో, ఆమె అరవై ఏళ్ల జీవితంతో  పోటీపడుతున్నట్టు. ఆమెలోని మరో మనిషి తొంగిచూస్తున్నట్టు కళ్లల్లో ఒక చిన్న వెలుగు - కష్టాలు మనుషులకి కాక మానులకా వస్తాయి అన్న సహజమైన ఒప్పుకోలు తాలూకు వెలుగు కాబోలు -  ప్రకాశిస్తూనే ఉంటుంది ఎప్పుడూ. నిరాశా నిస్పృహలకు తావులేదన్నట్టు కనిపించే చిరువెలుగే ఆమెలో నన్నాకట్టుకునేది. మా బాంకు పక్కనే ఉన్న బస్తీలో ఉండే ఆమె, ఆమె స్నేహితులూ ఇప్పటికి పదిహేను రోజులనుంచీ పెన్షన్ కోసం బాంకు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పింఛను జమ అయ్యిందా అని అడగటం,  ఇంకా లేదమ్మా అని నేను చెప్పడంతో, కాస్త దూరంలో చెట్టుకింద ఉన్న రాతిబండపై వాళ్లంతా కూర్చుని తోచినంతసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోవటం మా అందరికీ అలవాటైపోయింది.  


వేళ మరీకొంచెం అలసినట్టు అనిపిస్తున్న ఆమె ఇంకొక స్నేహితురాలిని తోడుపెట్టుకుని వచ్చింది. పింఛను ఇంకా జమ కాలేదని తెలిసి నీరసంగా నన్నే చూస్తూ నిలబడింది ఏం చేయాలో తోచనట్టు. హైదరాబాదు మే ఎండలు. ఏసీలో కూర్చున్న మేమే ఉక్కపోతగా ఉందనుకుంటున్న మిట్టమధ్యాహ్నం. 


ఆమెతో మాటకలుపుతూభోజనం అయ్యిందా అమ్మా?  పెన్షన్ పాటికి రావాల్సింది, ఎందుకింత ఆలస్యం అయిందో?” అన్నాను. 


నువ్వేంజేస్తవ్ తల్లీ, మళ్లొస్త. పింఛనొస్తే బియ్యం దెచ్చుకోవాలే అనుకున్న. ఊపిరి ఒప్పినంతకాలం పన్జేసినా బిడ్డా, ఇప్పుడు ఇళ్లల్ల పనిజేసుడు నాకైతలేత్తల్లి. మా మొగాయన ఉన్నన్ని రోజులు నన్నుగొట్టి నాలుగు పైసల్ దీస్కపొయ్యేటోడు, గిప్పుడాయనే లేడు. నాతోనున్న నా ఇరవై ఏండ్ల కొడుకు బేకార్గా తిరుగతా నే పెడితే తింటడు, లేదంటే పంటడు, గంతేగానీ పనైతే చెయ్యడు. పెద్ద కొడుకు, కోడలు ఇంట్లకి రానియ్యరుమీకు బువ్వ పెట్టుడు మాకైతలేదనవట్టిరి.  పింఛనే దిక్కు. జర బుక్కులో డబ్బులేమన్న ఉన్నయ్యేమో చూస్తవాపాస్‌బుక్ తీసిచ్చిందామె. అందులో ఏమీ లేవని నాకు తెలుసు, ఆమెకూ తెలుసు. కానీ ఆమె కోసం మరోసారి చూసి అదే మాట చెప్పాను. ఆమె బాధలు కొత్తవనీ కాదూ, నేనెప్పుడూ వినలేదనీ కాదు. కానీ ఆమె కళ్లల్లో మినుకుమనే వెలుగు, కనిపించే ధైర్యం, శాంతం నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తనగురించి చెప్పుకున్న క్షణంమాత్రం ఆమె కళ్లు తడిబారినయ్, పాస్బుక్ ఇస్తున్న నాచేతులు పట్టుకుని, ఎంత మంచిగ నవ్వుతూ మాట్లాడతవ్ బిడ్డా. తిన్నవా, పన్నవా, పానం బాగుందా అని అడగబడ్తవ్ఆమె కళ్లల్లో నీళ్లు. పక్కనే ఉన్నామె ఈమె భుజంమీద చెయ్యేసి, “అదేందక్కో కంటెంబడి నీళ్లు? నీకు మేం లేమా, మా ఇంట్ల బువ్వతిందు నడువ్. నువ్వు వేరు నేను వేరా అక్కా? బాంకమ్మను ఎందుకు సతాయించుడు. ఆమెకసలే ఫుల్లు పనుంటది, మన కష్టాలెందుకు చెప్పుడు?” అంది. 


ఆమె నా చేయి వదల్లేదు. చెమటతో చల్లగా ఉన్న ఆమె చేతుల్లో ఆత్మీయత తెలుస్తూనే ఉంది. నాలో ఏవో ప్రశ్నలు. వాటికి సమాధానమా అన్నట్టు ఆమె అంది: “పోన్లే బిడ్డా, ఇయ్యాల గాకపోతే పింఛను రేపొస్తది తియ్. ఈడికొస్తే నువ్వు మంచిగ పలకరిస్తవ్, పానానికి మంచిగనిపిస్తది. ఇగో లచ్మికి నా గురించే ఎప్పుడూ ఆలోచన. ఇసుమంటోళ్లు నలుగురుంటే సాలు తల్లీ. కష్టాలుంటయ్ అందరికీ - నీకులేవా, లచ్మికి లేవా? ఉన్న నాలుగు దినాలు నవ్వుకుంట బతికితె సాలనిపిస్తది బిడ్డా. మనం దినాలే ఇంకొకరికి పెట్టాలే, ఏడుస్తె ఏమొస్తత్తల్లి? గరీబుదాన్ని, సదువులేనిదాన్ని ఏమనుకోకు నాలెక్కంత చెప్పిన నీకు, వస్తా బిడ్డా,” అంటూ బయల్దేరిన ఆమెను చూస్తూ ఉండిపోయాను. 


నా కళ్లల్లోనూ చెమరింతతో కూడిన వెలుగు.