Saturday, July 25, 2015

Random Thoughts !!




చీకట్లను చీల్చుకుంటూ...
వెలుగుపైనే చూపు నిలిపి,
వెలుగుతోటే అడుగు కలిపి,
ప్రయాణం.
గమ్యం చేరేవరకు...
లక్ష్యం సాధించేవరకు!!!




Saturday, July 18, 2015

Random Thoughts !!

                                             Random Thoughts !!






    ….. and it continues to be so !!!



Thursday, July 9, 2015

నాకు నచ్చిన కొటేషన్స్!!!

                                           నాకు నచ్చిన కొటేషన్స్!!!


                                   


Sunday, July 5, 2015

Doodles!!


                                             డూడుల్స్

ఈ మధ్య డూడుల్స్ గీయడం మీద కొంచం ఇంట్రెస్ట్ వచ్చి, అదే పనిగా  ప్రయత్నిస్తున్నాను. కొంచం కష్టంగా ఉన్నా- సరదాగా, చాలా రిలాక్సింగ్ గా ఉంది. సో ప్రస్తుతం డూడుల్స్ గీసే ఫేజ్ లో ఉన్నానన్నమాట. అందుకే  ఈ మధ్య ఇలాంటి కొన్ని డూడుల్స్ నా బ్లాగ్ లో కనిపిస్తున్నాయి. కొన్ని దూడుల్స్ కి నేను ఏమీ రాయలేదు. అలాంటి రెండు డూడుల్స్ ఇక్కడ పెడుతున్నాను.

ఈ డూడుల్  కి “JOY” అని పేరు పెట్టాను!!



మరొకటి!!!
 

ఈ డూడుల్  కి “Harmony” అని పేరు పెట్టాను!!!



బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే, వాటిని నిర్వర్తించాల్సిందే. కానీ టైమ్ దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదవటం, మంచి సినిమాలు చూడటం, ఏదైనా క్రియేటివ్ పని చేయటం...ఆనందంగా ఉండటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి

Sunday, February 1, 2015

నాకు నచ్చిన సినిమా – “ద ఇమిటేషన్ గేమ్.”

నాకు నచ్చిన సినిమా ద ఇమిటేషన్ గేమ్.
Film : The Imitation Game. (2014-UK)
Director : Morten Tyldum.
Stars : Benedict Cumberbatch, Keira Knightley.

మోర్టెన్ టిల్డమ్ డైరెక్ట్ చేసీ, బెనెడిక్ట్ కంబర్బాచ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మనల్ని కదిలిస్తుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. నిజ జీవితానికి సంబంధించిన ఈ కధ ఆండ్రూ హాడ్జస్ రాసిన ”Alan Turing : The Enigma” అనే పుస్తకం ఆధారంగా నిర్మితమైంది. (పుస్తకం తప్పకుండా చదవాలి అని అనుకున్నాను J )

రెండో ప్రపంచ యుద్ద సమయంలో అలన్ ట్యూరింగ్   తెలివితేటలను బ్రిటన్ ఎలా ఉపయోగించుకుంది, ఒక దేశం తీసుకునే నిర్ణయాల వెనక - ఆ దేశ ప్రజలకు తెలియని, ప్రజల జీవితాలను, తలరాతలనూ మార్చే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు  అన్నది మనకు సూచనప్రాయంగా అవగతమౌతుంది.  అలాగే ఒక భిన్నమైన వ్యక్తిత్వం గురించి మనసుకు హత్తుకునేలా చెప్పటం జరిగింది. అలన్ ట్యూరింగ్ మేధస్సు ఎంత పదునైనదో చెబుతూనే అతనిలోని బలహీనతలను, తద్వారా అతను జీవితంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణను చక్కగా చూపించారు. ఆ పాత్రలో బెనెడిక్ట్ కంబర్బాచ్ నటన అద్భుతం!

ఎనిమిది అంశాలలో ఈ సినిమా ఆస్కార్ కి పోటీ పడుతోంది అంటే ఇంకా ఏం చెప్పాలి!

సినిమా చూసెయ్యండి మరి!!!

Sunday, January 11, 2015

నాకు నచ్చిన కవిత - "ఫినామినల్ ఉమన్" (మాయా ఏంజెలో)

మాయా ఏంజెలో ....

ఒక అద్భుతమైన రచయిత్రి. ఒక అద్భుతమైన కవియిత్రి.
ఒక అపురూపమైన పోరాటవాది, మానవతావాది, సమతావాది.
జాతి వివక్షను ఎదుర్కొని, తన చుట్టూ ఉన్న పరిస్ఠితులతో పొరాడి, జీవితాన్ని గెలిచిన “మాయా ఏంజెలో” ఒక ఉప్పెన, ఒక తుఫాను, ఒక ఉల్కాపాతం లా తన రచనలతో మన ఆలోచనలలోకి జొరబడి మరీ మనల్ని ఆలోచింప చేసే రచయిత్రి.
ఒక “ఫినామినల్ ఉమన్.”

ఆవిడ తనని తాను సగర్వంగా ఆవిష్కరించుకున్న కవిత “ఫినామినల్ ఉమన్.”

స్త్రీ వాదం అని కాదు గానీ ఇందులో కనిపించిన “వ్యక్తిత్వ” వాదం నాకు అబ్బురంగా కనిపించింది. ఇందులో ఒక స్త్రీ తన వ్యక్తిత్వం పట్ల ప్రకటించిన, నిజాయితీతో కూడిన అతిశయం నన్ను ఆకట్టుకుంది.

నేను ఎప్పుడూ నమ్మే విషయం -  స్త్రీకైనా, పురుషుడికైనా  స్వేచ్చ అనేది స్వంతం. అది జన్మతః వచ్చేది. ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. ఒకరిని అడిగి తీసుకునేది అంతకన్నా కాదు. తనను తను గౌరవించుకోవటం, తనని తను ఇష్ట పడటం, తనను తను నమ్మటం అన్నది ప్రతి మనిషికీ తన పట్ల తనకున్న కనీస బాధ్యత.(ఆ బాధ్యతని నిర్వర్తించటం చెప్పినంత సులువు కాదు అన్నది వేరే విషయం.) ఒక వ్యక్తిగా తనపట్ల తనకున్న బాధ్యతను, తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతనూసమాజం పట్ల తనకున్న బాధ్యతనూ నిర్వర్తించిన  వ్యక్తి మాయా ఏంజెలో. ఆవిడ అనుభవించిన జీవితం, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలూ, చూసిన జీవితం లోంచి పుట్టుకొచ్చిన వ్యక్తిత్వం, ఒక స్త్రీ పరంగా రాసిన ఈ కవితలో మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.

ఈ కవితను ఆవిడ గొంతులోనే వినండి ఈ కింద లింక్ లో:

లేదా ఇక్కడ చదవండి : 

Phenomenal Woman

    Pretty women wonder where my secret lies.
I’m not cute or built to suit a fashion model’s size   
But when I start to tell them,
They think I’m telling lies.
I say,
It’s in the reach of my arms,
The span of my hips,   
The stride of my step,   
The curl of my lips.   
I’m a woman
Phenomenally.
Phenomenal woman,   
That’s me.

I walk into a room
Just as cool as you please,   
And to a man,
The fellows stand or
Fall down on their knees.   
Then they swarm around me,
A hive of honey bees.   
I say,
It’s the fire in my eyes,   
And the flash of my teeth,   
The swing in my waist,   
And the joy in my feet.   
I’m a woman
Phenomenally.

Phenomenal woman,
That’s me.

Men themselves have wondered   
What they see in me.
They try so much
But they can’t touch
My inner mystery.
When I try to show them,   
They say they still can’t see.   
I say,
It’s in the arch of my back,   
The sun of my smile,
The ride of my breasts,
The grace of my style.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.

Now you understand
Just why my head’s not bowed.   
I don’t shout or jump about
Or have to talk real loud.   
When you see me passing,
It ought to make you proud.
I say,
It’s in the click of my heels,   
The bend of my hair,   
the palm of my hand,   
The need for my care.   
’Cause I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.

ప్రస్తుతానికి ఇంతే మరి. మళ్ళీ ఇంకో విషయంతో, ఇంకోసారి...